Breaking News

బన్నీసినిమా రీమేక్ కు హీరో గా

03 rd Jun 2020, UTC
బన్నీసినిమా రీమేక్ కు హీరో గా

టాలీవుడ్ హీరో బన్నీ..మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన సినిమా "అల వైకుంఠపురం లో " సినిమా అందరిని అలరించిన సంగతి తెలిసిందే.. ఇది బన్నీ కెరీర్ లో ఓ మంచి సినిమా గా నిలిచిపోయింది. ఈ చిత్రం ద్వారా అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ చేసిన మ్యాజిక్ ప్రేక్షకులను కట్టిపడేసింది. సంగీత పరం గా కూడా ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. దీంతో ఈ చిత్రం రీమేక్ హక్కుల కోసం మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ నేపధ్యం లో బాలీవుడ్ నిర్మాత అశ్విన్ వర్ధే ఈ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేసారు. ఈ చిత్రం హిందీ రీమేక్ హక్కులను భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి సొంతం చేసుకున్నారు.  ఈ చిత్ర రీమేక్ లో నటించడానికి కూడా పలువురు హీరో లు ఆసక్తి కనబరుస్తున్నారు.  హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్ ల పేర్లు ఇప్పటికే ప్రచారం లోకి వచ్చినా... అశ్విన్ మాత్రం రణ్ వీర్ సింగ్ తో ఈ చిత్రాన్ని చేయాలని భావిస్తున్నాడట. ప్రస్తుతం ఈ విషయంలో ఆయన రణ్ వీర్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు చిత్ర వర్గాల టాక్. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox