Breaking News

షూటింగ్ మొదలవని సినిమాలో నన్ను తొలగించారా?:రకుల్ ప్రీత్ సింగ్

29 th Jun 2020, UTC

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ శివకార్తికేయన్‌కు జంటగా నటించే  చిత్రం నుంచి తొలగించినట్టు  సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.అయలన్‌ చిత్రం షూటింగ్‌ పూజాకార్యక్రమాలతోనే  నిలిచిపోయింది.  లాక్‌డౌన్‌ తరువాత షూటింగ్‌  కొనసాగించవలసి వుంది. అయితే కరోనా భయంతో ఈ చిత్ర షూటింగ్‌ లో పాల్గొనడానికి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నిరాకరించినట్లు, దీంతో ఆమెను చిత్రం నుంచి తొలగించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

దీనిపై స్పందించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మీడియా ఎప్పుడు నిజాలను ప్రచారం చేస్తుందో తెలియడం లేదని వాపోయింది. వాస్తవాలను ప్రచారం చేస్తే బాగుంటుందని తన ట్విట్టర్‌లో పేర్కొంది.  అసలు షూటింగ్‌ ఎప్పుడు మొదలైందని, అందులో పాల్గొనడానికి తాను నిరాకరించినట్లు ప్రచారం చేస్తున్నారు అని ప్రశ్నించింది. నిజానికి అయలన్‌ చిత్ర షూటింగ్లో ఎప్పుడెప్పుడు పాల్గొందామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు రకుల్‌ పేర్కొంది.

ఈ విషయమై  చిత్ర దర్శకుడు రవికుమార్‌ స్పందిస్తూ తన పనిచేసిన కళాకారులు అందరిలోకి అత్యంత అంకిత భావం కలిగిన నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అని పేర్కొన్నారు. అలాంటిది ఆమెను తొలగించినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు. అదే విధంగా తమ యూనిట్‌ అంత  చిత్ర షూటింగ్‌ ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.

రకుల్ కుశంకర్‌ దర్శకత్వంలో కమలహాసన్‌తో ఇండియన్‌–2 చిత్రం లో నటించే అవకాశం  వచ్చింది. అయితే ఆ చిత్రం కూడా షూటింగ్‌లో క్రేన్‌ పడిపోవడం నలుగురు దాని కింద పడి చనిపోవడం వంటి సమస్యల కారణంగా షూటింగ్‌ వాయిదా పడింది. ఆ తరువాత లాక్ డౌన్ కారణంగా  చిత్ర పరిశ్రమే స్తంభించిపోయింది.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox