Breaking News

'పవర్ ప్లే' తో వస్తున్న రాజ్ తరుణ్

26 th Feb 2021, UTC
'పవర్ ప్లే' తో వస్తున్న రాజ్ తరుణ్

సినిమా చూపిస్తా మావ, కుమారి21ఎఫ్ లాంటి వరుస హిట్లతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నటాలీవుడ్ యువహీరో రాజ్ తరుణ్ కు చాల కాలంగా సరైన హిట్ రాలేదు. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా యావరేజ్ టాక్ మాత్రం వచ్చింది. రాజ్ తరుణ్ ప్రస్తుతం 'పవర్ ప్లే' అనే థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. 

రాజ్ తరుణ్ చివరిగా చేసిన 'ఒరేయ్ బుజ్జిగా' ఫేమ్ విజయ్ కుమార్ కొండానే మళ్లీ ఈ పవర్ ప్లే సినిమాను కూడా తెరకెక్కించాడు. విడుదలకు దగ్గరపడిన ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. మొత్తానికి సినిమా మార్చ్ 5న విడుదల అయ్యేందుకు రెడీ అయిపోయింది. ఇందులో హేమల్ ఇంగ్లే హీరోయిన్ గా నటించింది. హీరోయిన్ పూర్ణ ప్రధాన పాత్రలో నటించింది .

ఈ సినిమాను వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై మహీధర్, దేవేష్ లు సంయుక్తంగా నిర్మించారు. మరి చాలకాలం నుంచి హిట్ కోసం చూస్తున్న రాజ్ తరుణ్ ఈ సినిమాతో అయినా హిట్ దక్కించుకుంటాడేమో చూడాలి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox