Breaking News

మహేష్ బాబు అద్బుతంగా నటించారు.. కె. రాఘవేంద్రరావు

12 th May 2022, UTC

Tollywood: టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కార్ వారి పాట సినిమా గురువారం రిలీజయింది. దీనితో తెలుగు రాష్ట్రాల్లో ధియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. సినిమా చూసిన అభిమానులు  తమ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా  మహేష్ ఇరగదీసాడని సంబరపడుతున్నారు. మరోవైపు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాగురించి చేసిన ట్వీట్ అందరినీ ఆకర్షించింది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు అదిరిపోయే విధంగా అద్బుతంగా నటించారు. స‌ర్కారు వారి పాట‌లో ఫంటాస్టిక్ కామెడీ టైమింగ్ ఉందంటూ కితాబిచ్చారు. చిత్ర‌యూనిట్ అంద‌రికి శుభాకాంక్ష‌లు అని ట్వీట్ చేశారు రాఘ‌వేంద్ర‌రావు. దర్శకేంద్రుడి ట్వీట్ ఈ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని అభిమానులు సంబరపడుతున్నారు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox