Breaking News

50 రోజులు నైట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఆర్ ఆర్ ఆర్ 

30 th Nov 2020, UTC

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ తాజాగా 50 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఇందుకు సంబంధించిన షూటింగ్‌ అంతా రాత్రి వేళలోనే జరిగింది. త్వరలోనే మరో షెడ్యూల్‌ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఇందుకు సంబంధించి ఓ వీడియోను ట్వీట్‌ చేసింది. 

‘గుడ్‌బై వింటర్‌ నైట్స్‌.. ప్రధాన యాక్షన్‌ సీక్వెన్స్‌ షెడ్యూల్‌ కోసం దాదాపు 50 రోజులు నైట్‌ షూట్‌ చేశాం. ఇప్పుడు కొత్తది మొదలవబోతోంది. ఈ కొత్త షెడ్యూల్‌ అద్భుతమైన ప్రదేశాల్లో తెరకెక్కనుంది’ అంటూ సెట్స్‌ని కూల్చివేస్తున్న వ్యక్తులకు సంబంధించిన వీడియోను ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌షేర్‌ చేసింది ..డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రియ, అజయ్‌ దేవగన్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox