Breaking News

క్వారంటైన్ నుంచి విడుదలయిన బిహార్ ఐపీఎస్ అధికారి

07 th Aug 2020, UTC

 ముంబై : క్వారంటైన్‌లో ఉన్న బిహార్‌ ఐపీఎస్‌ అధికారి వినయ్‌ తివారీని ఆయన స్వరాష్ట్రానికి వెళ్లేందుకు బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు అనుమతించారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో రియా చక్రవర్తిపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలైన నేపథ్యంలో కేసు దర్యాప్తును పర్యవేక్షించేందుకు ముంబై చేరుకున్న పట్నా ఎస్పీ వినయ్‌ తివారీని కోవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా బీఎంసీ అధికారులు క్వారంటైన్‌ చేశారు. ఆగస్ట్‌ 15 వరకూ క్వారంటైన్‌లో ఉండాలని, ఆయనకు బీఎంసీ అధికారులు క్వారంటైన్‌ ముద్ర వేశారు.
 
కాగా తివారీని విడుదల చేయాలని బిహార్‌ పోలీసులు కోరడంతో క్వారంటైన్‌ గడువుకు వారం ముందుగానే ఆయనను విడుదల చేశామని బీఎంసీ అధికారి తెలిపారు.  ప్రతి రోజూ ముంబయ్ కి  వేలాది మంది  వస్తుంటారని వారికి ఎవరికీ లేని క్వారంటైన్ తనకే ఎందుకు పెట్టారని వినయ్ తివారీ ప్రశ్నించారు. తన దర్యాప్తును అడ్డుకునేందుకే ఇలా చేసారని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. మరో వైపు సుప్రీం కోర్టు కూడ తివారీ బలవంతపు క్వారంటైన్ సరికాదని తప్పుడు సంకేతాలు వెడతాయని చెప్పడంతో ఆయనను విడుదల చేయాలని మహారాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. 
 
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తునకు సంబంధించి రియా  చక్రవర్తి శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు.  తన సోదరుడు సౌవిక్ చక్రవర్తితో కలిసి ముంబైలోనీ ఈడీ కార్యాలయానికి చేరుకున్న రియాపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. మరిన్ని వార్తలు చదవండి : సుశాంత్ సింగ్ ఆర్దిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox