Breaking News

నెట్‌ఫ్లిక్స్ లో  క్వీన్స్ గాంబిట్ రికార్డు

24 th Nov 2020, UTC

నెట్‌ఫ్లిక్స్ లో ఎక్కువమంది చూసిన సిరీస్‌గా క్వీన్స్ గాంబిట్ రికార్డు సృష్టించింది. మొదటి 28 రోజుల్లో 62 మిలియన్ల మంది దీన్ని చూసినట్లు తెలుస్తోంది. 1950వ నాటి ఈ ప్రదర్శనలో యువ అనాధ అయిన బెత్ హార్మోన్ చెస్ కోసం పడే తపన ను చూపించారు.వాల్టర్ టెవిస్ నవల ఆధారంగా నిర్మించిన ఈ సిరీస్ అక్టోబర్ 23న ప్రదర్శించబడింది.

ఈ ఏడు ఎపిసోడ్ల ప్రదర్శన 92 దేశాలలో టాప్ 10 లో ఉందని, యుకె, అర్జెంటీనా, ఇజ్రాయెల్ మరియు దక్షిణాఫ్రికాతో సహా 63 దేశాలలో మొదటి స్థానంలో ఉందని నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది.నెట్‌ఫ్లిక్స్  సిరీస్ ల రేటింగ్ విధానం వేరేగా వుంటుంది.కనీసం రెండు నిమిషాల కంటెంట్‌ను చూసిన  ప్రేక్షకులసంఖ్యపై ఆధారపడి ఉంటుంది, ఇది టీవీ పరిశ్రమ ప్రేక్షకులను ఎలా కొలుస్తుందో దానికి చాలా భిన్నంగా ఉంటుంది. క్వీన్స్ గాంబిట్ కు స్కాట్ ఫ్రాంక్ రచన మరియు దర్శకత్వం వహించారు. అతను డోంట్ లుక్ నౌ ఫేమ్ యొక్క అలన్ స్కాట్‌తో కలిసి ఈ సిరీస్‌ను తెరకెక్కించాడు.
నెట్‌ఫ్లిక్స్ యొక్క  విపి ఒరిజినల్ సిరీస్ కు చెందిన పీటర్ ఫ్రైడ్‌ల్యాండర్ రచయిత మరియు చిత్రనిర్మాతగా ఫ్రాంక్ యొక్క నైపుణ్యానికి  ఇది ఒక నిజమైన నిదర్శనం అని పేర్కొన్నాడు.

50వ దశకానికి సంభందించిన కధ, స్త్రీవాదం, మరియు బెత్ పాత్రలో టేలర్-జాయ్ యొక్క డైనమిక్ నటన అల్మా వీట్లీ  పాత్ర, బెత్ యొక్క సమస్యాత్మక తల్లి పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీనిలో థామస్ బ్రాడీ-సాంగ్స్టర్, మోసెస్ ఇంగ్రామ్, హ్యారీ మెల్లింగ్ మరియు బిల్ క్యాంప్ నటించారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox