Breaking News

ఇంకో బంపర్ ఆఫర్ ను కొట్టేసిన పూజ..!

09 th Jun 2020, UTC
ఇంకో బంపర్ ఆఫర్ ను కొట్టేసిన పూజ..!
ఒక లైలా కోసం, ముకుంద లాంటి సినిమాలతో... తెలుగు ప్రేక్షకుల మది ని దోచుకున్న పూజ హెగ్డే ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. పూజ ది గోల్డెన్ లెగ్.. వరుస అవకాశాలే కాదు.. హిట్ లు కూడా వస్తున్నాయి. తన సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే స్టేజి కి  టాలీవుడ్ కి వచ్చిన తొందర్లోనే చేరుకుంది పూజ.అల వైకుంఠపురం సినిమా హిట్ తో పూజ ఫుల్ జోష్ లో ఉంది.  ప్రస్తుతం..ఆమె బాలీవుడ్ లోను సత్తా చాటేస్తోంది.
 
            ఇప్పటికే.. పూజ సల్మాన్ సరసన ఛాన్స్ కొట్టేసింది. సల్మాన్ తోనే కాదు.. అక్షయ్ కుమార్ సరసన కూడా పూజ నటించబోతోంది. ఇది ఇలా ఉంటె... పూజ కు అదృష్టం మరోసారి తలుపు తట్టింది. బాలీవుడ్ లో మరో సినిమాలోనూ పూజకు అవకాశం వచ్చిందట. ఈ సినిమా తెలుగుతోపాటు ఇతర దక్షిణాది భాషల్లోనూ విడుదల అవుతుందని ఫిలిం వర్గాల టాక్..
 
            స్వప్న సినిమా బ్యానర్‌పై దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తారని సమాచారం. ఈ చిత్రం ప్రేమ కధగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు పూజ ని అడిగారట. అయితే.. పూజ కూడా వెంటనే ఓకే చెప్పేసిందట. ఈ సినిమా తమిళ, మలయాళ భాషలలో కూడా విడుదల అవుతుండడంతో... ఆ భాష ల నుంచి కూడా తనకు అవకాశాలు రావొచ్చని పూజ భావిస్తోంది. తక్కువ కాలం లోనే మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ తన కెరీర్ లో మరింత ముందు కు వెళ్తుంది. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox