Breaking News

మా లో ముసలం.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ రాజీనామా

12 th Oct 2021, UTC

మా ఎన్నికల్లో తమ ప్యానెల్లో గెలిచిన వారందరూ రాజీనామా చేయాలని నిర్ణయంచనట్లు నటుడు ప్రకాష్ రాజ్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మా ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్‌లోనూ అక్రమాలు జరిగాయి. రౌడీయిజం జరిగింది.సీనియర్ నటుడు  బెనర్జీపై  మోహన్ బాబు చేయి చేసుకున్నారు. పోలింగ్ రోజు జరిగిన సంఘటనలు చాలా బాధ కలిగించాయి. అందుకే రెండు రోజులుగా జరిగిన పరిణామాలపై అందరం కూర్చుని చర్చించాం. ‘మా’ ఎన్నికలలో గెలిచిన విష్ణు‌కి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు మా ప్యానల్‌లో గెలిచిన వారందరం రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. విష్ణుగారు వారికి నచ్చిన వారిని తీసుకుని పరిపాలన చేయాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నాం.. అని అన్నారు.తన ప్యానల్‌లో గెలిచిన ఎనిమిది మంది ఈసీ మెంబర్లు శివారెడ్డి, బ్రహ్మాజీ, ప్రభాకర్, తనీష్, సురేష్ కొండేటి, కౌశిక్, సుడిగాలి సుధీర్, సమీర్‌లతో పాటు శ్రీకాంత్, ఉత్తేజ్, బెనర్జీలు కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకాష్ రాజ్  తెలిపారు. మా బైలాస్ ను  మార్చకపోతే తన రాజీనామాను వెనక్కి తీసుకుంటానని ఆయన అన్నారు.

ఎన్నికల రోజు తనను మోహన్‌ బాబు అరగంట పాటు బూతులు తిట్టారని నటుడు బెనర్జీ ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నానని, అలాంటిది అందరి ముందు మోహన్‌ బాబు బూతులు తిడుతూ అవమానించారని చెబుతూ బెనర్జీ ఎమోషనల్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'ఎలక్షన్స్‌లో గెలిచానని అందరూ కంగ్రాట్స్‌ చెప్పినా అది నేను తీసుకోలేకపోయాను. ఎందుకంటే పోలింగ్‌ రోజు ఉదయమే వందల మందిలో మోహన్‌ బాబు నన్ను పచ్చి బూతులు తిట్టారు.తనీష్‌ను తిడుతుంటే ఆపినందుకు నన్ను మోహన్‌బాబు కొట్టబోయారు.  మోహన్‌బాబు సతీమణి కూడా ఫోన్‌ చేసి నన్ను ఓదార్చారు. పోలింగ్ రోజు జరిగిన పరిణామాలను నుంచి ఇంకా తేరుకోలేదు చాలా చాలా బాధ కలిగింది. ఇలా ఎందుకు బతకాలి మనం?ఇలాంటి అసోసియేషన్‌లో ఎందుకు ఉండాలి' అంటూ బెనర్జీ కంటతడి పెట్టారు. 

నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ అభివృద్ధి ముందుకెళ్లాలంటే ఇరు ప్యానళ్ల నుంచి సగం సగం సభ్యులు గెలిస్తే కుదరదు. ఆ ప్యానెల్‌లో కొంతమంది, ఈ ప్యానెల్‌లో కొంతమంది గెలిచాం. అన్ని విమర్శలు చేసుకున్నాక కలిసి పనిచేయగలమా అనిపించింది. మా ప్యానల్‌ సభ్యులు నిన్నే రాజీనామా చేస్తామని అన్నారు. అయితే సుదీర్ఘంగా జరిగిన చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. గతంలో ఇలాగే కలిసి పనిచేసినప్పుడు చాలా వివాదాలు తలెత్తాయి. ఏ సమస్య ఎత్తి చూపినా మమ్మల్ని పనిచేయనీయడం లేదు అని అంటారు. విష్ణు నాకు సోదరుడులాంటి వారు. ఆ ప్యానల్‌కు అన్ని తానే అయ్యి నరేశ్‌గారు చాలా అద్భుతంగా ఎన్నికలు నడిపించారు.  తన అనుభవంతో కృష్ణుడిలా చక్రం తిప్పి విష్ణుకు విజయం చేకూర్చారు. ఆయన విష్ణు వెనుక ఉండి మేము ఏదైనా అంటే మళ్లీ వివాదాలు ముదిరిపోతాయి. మా ప్యానల్‌లో ఉన్న వారంతా తప్పు జరిగితే ప్రశ్నించే ధైర్యం ఉన్నవారు.  మేం వెళ్లి ప్రశ్నిస్తే మళ్లీ గొడవలు మొదలవుతాయి. నరేశ్‌ నన్ను ఎన్నో మాటలు అన్నాడు అయినా భరించాను  అని శ్రీకాంత్‌ అన్నారు. నటుడు ఉత్తేజ్, ప్రభాకర్ కూడ మా ఎన్నికల నిర్వహణను తప్పు పట్టారు.  ఇటువంటి  పరిస్దితుల్లో తాము రాజీనామా చేయడమే కరెక్టని అన్నారు.

 ‘‘

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox