Breaking News

ప్రకాష్ రాజ్ ప్యానెల్ రాజీనామాలు అందలేదు.. మంచు విష్ణు

18 th Oct 2021, UTC

మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన  అనంతరం  మంచు విష్ణు కార్యవర్గం  సోమవారం  తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అనంతరం శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థలో తన ప్యానల్‌ సభ్యులతో కలిసి  విష్ణు కేక్‌ కట్‌ చేసి తమ గెలుపును సెలబ్రెట్‌ చేసుకున్నారు. 

ఈ సందర్భంగా మంచు విష్ణు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ గెలుపు నా ప్యానల్‌ది.. మా అందరిది. మా ప్యానల్లో ప్రతి ఒక్కరు కృషి చేస్తేనే నాకు ఓట్లు పడ్డయి. వారందరికి నా కృతజ్ఞతలు. ప్రతి పోటీలో గెలుపు-ఓటములు సహజం. ఈ సారి మేము గెలిచాం. ఇది మా అందరి కష్టం. ఈ సారి వాళ్లు గెలవలేదు. ఐ విష్‌ బెటర్‌ లక్‌ నెక్ట్‌టైం’ అని వ్యాఖ్యానించారు. ప్రకాశ్‌ రాజ్‌ సంతోషంగా సీసీ పుటేజ్‌ను చూడొచ్చు. మేము ప్రజాస్వామ్య బద్ధంగానే గెలిచాం. ఎన్నికల సమయంలో మా మధ్య చిన్న చిన్న గొడవలు ఇరువైపుల జరిగి ఉండోచ్చు. దీంతో మా మధ్య చిన్న చిన్న మనస్పర్థలు మాత్రమే వచ్చాయి తప్ప అక్కడ ఏం జరగలేదు. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్లో గెలిచిన వారి రాజీనామాలు మేము మీడియా ద్వారానే విన్నాం. ఇప్పటి వరకు నాకు ప్రకాశ్‌ రాజ్‌ రాజీనామానే అందింది. మిగతా ఆయన ప్యానల్‌ సభ్యుల రాజీనామా లేఖలు అందలేదు’ అని విష్ణు స్పష్టం చేసారు. అలాగే ప్రకాశ్‌ రాజ్‌, నాగబాబుల రాజీనామాలు తాను ఆమోదించలేదని విష్ణు తెలిపారు.  

మంచు విష్ణు టీం  తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామిని వీఐపీ దర్శనం ద్వారా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.  ఆలయ అర్చకులు ‘మా’ నూతన కార్యవర్గాన్ని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. మంచు విష్ణుతో పాటు శివ బాలాజీ, గౌతం రాజు, కరాటే కళ్యాణి, పూజిత, జయవాణి, మాణిక్, శ్రీనివాసులు ఉన్నారు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox