Breaking News

ప్రదీప్ సాంగ్ 150 మిలియన్ వ్యూస్ దాటేసింది...!

04 th Jun 2020, UTC

యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయం అవుతున్న సినిమా '30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ సినిమాలోని ‘నీలినీలి ఆకాశం ఇద్దామనుకున్నా’ పాట యూట్యూబ్లో సెన్సేషన్ సృష్టిస్తోంది. తెలుగు సంగీత ప్రియుల ఆదరణతో 150 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి చిన్న సినిమాల పాటల్లో ఈ ఫీట్ సాధించిన కొత్త పాటగ సరికొత్త రికార్డు సాధించింది. సుకుమార్ దగ్గర ఆర్య 2, 1నేనొక్కడినే సినిమాలకు పనిచేసిన మున్నా.. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

 ఈ సినిమాను ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్పై కన్నడ చిత్రసీమలో విజయవంతమైన నిర్మాతగా పేరుపొందిన ఎస్వీ బాబు నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చిన.. ‘ ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ సినిమాలోని అన్ని పాటలనూ చంద్రబోస్ రాశారు.

. అనూప్ రూబెన్స్ ఇచ్చిన వినసొంపైన బాణీకి చంద్రబోస్ రాసిన కమనీయ సాహిత్యం.. అలాగే సిద్ శ్రీరామ్ సునీత తియ్యని గళాలు ఈ పాటను ఇంత  సక్సెస్ చేశాయని నిర్మాత ఎస్వీ బాబు అన్నారు. ఈ సందర్భంగా సంగీత ప్రియులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్బంగా ఒక సింగర్ను ఐదేళ్లు బ్రతికించడానికి ఒక పాట చాలనీ నీలి నీలి ఆకాశం అలాంటి పాటనీ గాయని సునీత పేర్కొంది. అంతేగాక తన కెరీర్లో ఈ పాట ఓ మధురమైన మలుపుగా నిలించిందని ఆమె అమితానందం వ్యక్తం చేశారు. ఈ పాట విజయోత్సవంలో తాను భాగస్వామిని అయినందుకు గర్వపడుతున్నానని చంద్రబోస్ తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox