Breaking News

కేసీఆర్ పై పోసాని ప్రశంసల వర్షం!

21 st Nov 2020, UTC
కేసీఆర్ పై పోసాని ప్రశంసల వర్షం!

హైదరాబాద్ :ఎన్నికలలో సినీ నటుల ప్రచారానికి కూడా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే, వారికి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా వారి చేత ప్రచారం చేయించుకోవడానికి రాజకీయ నాయకులూ కూడా ఆసక్తి కనబరుస్తారు. సినీ ఇండస్ట్రీలో పోసాని కృష్ణ మురళి పేరు తెలియని వారుండరు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడడం ఆయన తత్త్వం. రాజకీయాల్లో కూడా ఆయన శైలి అలాగే ఉంటుంది. ఏ విషయం అయినా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ లో ఆయన వైసీపీ పార్టీకి తన మద్దతు తెలిపారు.

అలాగే, తెలంగాణలో కూడా తన మద్దతు ఎవరికీ ఉంటుందో చెప్పేసారు. రాబోయే గ్రేటర్ ఎన్నికలలో తెరాస పార్టీకె మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. తెరాస పార్టీ అధికారంలో ఉండడం వల్లే రాష్ట్రములో శాంతిభద్రతలు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఆరేళ్ళ క్రితం హైదరాబాద్ ఎలా ఉండేదో గుర్తు చేసుకున్నారు. మతకల్లోలాలు, శాంతి భద్రతలు గతంలో లేవని, కేసీఆర్  వల్లే రాష్ట్రము పచ్చగా ఉందని పోసాని కితాబిచ్చారు. ఉమ్మడి రాష్ట్రముగా ఉన్నపుడు తెలంగాణ ఇంత పచ్చగా లేదన్నారు. కెసిఆర్ అధికారంలోకి వస్తే, ఆంధ్ర ప్రజలను వెళ్ళగొడతారని అప్పట్లో ప్రచారాలు చేసారని గుర్తు చేసారు. 

కానీ, ఇప్పుడేమైంది అని ప్రశ్నించారు. కేసీఆర్ కు అప్పటి ఆంధ్ర పాలకులపైనే తప్ప ప్రజలపై కోపం లేదన్నారు. గత ఆరేళ్లలో, ఆంధ్ర ప్రజలను తరిమికొట్టిన ఘటన ఒక్కటి కూడా జరగలేదన్నారు. తెలంగాణలో రోజంతా కరెంటు ఉంటోందని గుర్తు చేసారు. రూ.లక్ష కోట్లతో దేశంలోనే గొప్పదిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయడం ఒక్క కేసీఆర్ కె సాధ్యమన్నారు. నిజాం కాలం నాటి డ్రైనేజి వ్యవస్థను అస్తవ్యస్తం చేసి, ఆక్రమించుకుంటూ భవనాలు నిర్మించడం వలెనే వరదల వలన ఇబ్బంది పడాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే, అది కేసీఆర్ కే  సాధ్యమని పోసాని చెప్పుకొచ్చారు. రాబోయే జీహెచ్ఎంసి ఎన్నికల్లో, ప్రజలంతా తెరాసకు ఓటేసి గెలిపించాలని కోరారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox