Breaking News

కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వనున్న బుట్టబొమ్మ..!

19 th Jan 2021, UTC

కోలీవుడ్ :ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ సమయంలోనే వరుస ఆఫర్లతో బిజీ అయిపోయిన బుట్టబొమ్మ పూజ హెగ్డే తాజాగా, కోలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లలో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటూ పూజ బిజీగా ఉంది. పూజ టార్గెట్ బాలీవుడ్ నే అయినా, తెలుగులో వచ్చే మంచి అవకాశాలను వదులుకోవట్లేదు. తనకు కెరీర్ ఇచ్చిన టాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది. తాజాగా, పూజ హెగ్డే కోలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 

తమిళ సూపర్ స్టార్ విజయ్ సరసన నటించే ఛాన్స్ ని కొట్టేసింది పూజ.  విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళనాట  ఓ భారీ సినిమాని నిర్మించాలని భావిస్తున్నారట. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజకు అవకాశం రానున్నట్లు తెలుస్తోంది. డేట్స్ కు సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. మరిన్ని వార్తలు చదవండి

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox