Breaking News

పవన్ కళ్యాణ్ మామిడి పళ్లు పంపలేదు.. ఆలీ

02 nd Jun 2020, UTC
పవన్ కళ్యాణ్ మామిడి పళ్లు పంపలేదు.. ఆలీ
గత ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్, అలీల మధ్య కొన్ని విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. . అయితే     ఆ తర్వాత ఎప్పుడూ అలీ  పవన్ కల్యాణ్ ప్రస్తావన తేలేదు. లాక్‌డౌన్ సందర్భంగా అలీ కొన్ని ఛానెల్స్‌లో లైవ్‌లో పాల్గొంటున్నారు. ఇంటర్వ్యూలో ఇస్తున్నారు. లాక్‌డౌన్‌లో తను ఏం చేసింది? ఏం చేస్తుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది వంటి విషయాలతో పాటు పవన్ కల్యాణ్ ప్రస్తావన కూడా ఖచ్చితంగా వస్తుంది కాబట్టి.. దానిపై కూడా అలీ స్పందిస్తుంటారు.

తాజాగా ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌గారికి నేనంటే చాలా ఇష్టం. నా కామెడీ అన్నా, హావభావాలు అన్నా ఆయన బాగా ఇష్టపడతారు. . దాదాపు ఆయన నటించిన అన్ని చిత్రాలలో నేను నటించాను. అన్నయ్య చిరంజీవిగారి కోసం వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు కళ్యాణ్‌గారు ఆప్యాయంగా పలకరించేవారు. అప్పటికి ఆయన సినిమాల్లోకి రాలేదు.

 ఆయన సినిమాలలో మొదటి నుంచి ఉన్నప్పటికీ ‘తొలిప్రేమ’ చిత్రం నుంచి మా మధ్య అనుబంధం బాగా బలపడింది. ప్రతి సంవత్సరం అన్నయ్య చిరంజీవిగారు ఆవకాయ పచ్చడి పంపిస్తారు. పవన్ కల్యాణ్‌గారు సేంద్రీయ పద్ధతులలో పండించిన మ్యాంగోస్ పంపుతారు. కానీ ఈ సంవత్సరం ఆయన రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల పంపలేదు. వచ్చే సంవత్సరం పంపుతారని అనుకుంటున్నాను.. అని అలీ చెప్పుకొచ్చారు. 
 
Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox