Breaking News

విశ్వక్ సేన్ - ఐశ్వర్య సర్జా మూవీకి క్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్

23 rd Jun 2022, UTC

Tollywood: యాక్షన్‌ కింగ్ అర్జున్‌  దర్శకత్వంలో యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌, ఐశ్వర్య సర్జా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం షూటింగ్ నేడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గురువారం రామానాయడు స్టూడియోలో ఈ మూవీ పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ కార్యక్రమానికి నటుడు పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా హజరై హీరోహీరోయిన్ల తొలి సీన్‌కు క్లాప్‌ కొట్టారు. కె రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా మంచు విష్ణు స్క్రిప్ట్‌ను అందజేశారు.

ఈ చిత్రానికి అర్జున్‌ కథా రచయిత, దర్శకత్వంతో పాటు స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం కాబోతోంది. అర్జున్‌కి మంచి స్నేహితుడైన జగపతిబాబు ఇందులో కీలకపాత్ర పోషించనున్నాడు. ఈ చిత్రానికి కేజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తారు. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox