Breaking News

త్రివిక్రమ్ తో మరోసారి జతకడుతున్న పవర్ స్టార్..!

13 th Jun 2020, UTC
త్రివిక్రమ్ తో మరోసారి జతకడుతున్న పవర్ స్టార్..!

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌ అంటేనే అభిమానుల్లో, పరిశ్రమలో చాల అంచనాలు వుంటాయి. వీరిద్దరు స్వతహాగా మంచి స్నేహితులు కావడం, ఇద్దరి అభిరుచులు ఇంచుమించుగా ఒకేలా వుండటంతో వీరిద్దరి మధ్య  మంచి కెమిస్ట్రీ వుంటుంది. అందుకే వీరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాల్లో రెండు సూపర్ హిట్స్ అయ్యాయి. అయితే త్యరలో వీరిద్దరు కలిసి మరో సినిమాకు పనిచేయబోతున్నారా?

 అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్‌ వర్గాలు. ప్రస్తుతం టాలీవుడ్‌ సర్కిళ్లలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్‌తో మరో సినిమా చేయాలని పవన్‌ ఆసక్తిని కనబరుస్తున్నారు.

ఈ మధ్య పవన్‌కు త్రివిక్రమ్‌ ఓ కథ వినిపించడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయట. అంతేకాకుండా వీలైనంత త్వరగా పూర్తి స్క్రిప్ట్‌ను సిద్దం చేసి తక్కువ సమయంలోనే ఈ చిత్రాన్ని తీసేలా ప్లాన్‌ చేయాలని త్రివిక్రమ్‌కు పవన్‌ సూచించారని సమాచారం.

ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' చేస్తున్న పవన్, ఆ తర్వాత క్రిష్‌ దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ చిత్రం చేయనున్నారు. హరీష్‌ శంకర్‌తో ఓ సినిమాకు కూడా పవన్‌ కమిట్‌ అయ్యారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా క్రిష్‌ సినిమాకు సంబంధించి భారీ సెట్‌ల నిర్మాణాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయట. దీంతో ప్రభుత్వాలు షూటింగ్‌లకు అనుమతి ఇచ్చినా ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. క్రిష్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభంకావడానికి ముందు వచ్చే ఈ చిన్న గ్యాప్‌లో త్రివిక్రమ్‌తో సినిమా చేయాలని పవన్‌ భావిస్తున్నారని తెలుస్తోంది.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox