Breaking News

సుశాంత్ ది హత్యా...? సిబిఐ తో విచారణ జరపాలన్న పార్టీ చీఫ్!

15 th Jun 2020, UTC
సుశాంత్ ది హత్యా...? సిబిఐ తో విచారణ జరపాలన్న పార్టీ చీఫ్!
బాలీవుడ్ ప్రముఖ నటుడు.. వెండితెర ధోని నిన్న తన ప్లాట్ లో ఉరి వేసుకుని వేలాడుతూ కనపడిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ముంబై పోలీసులు ప్రాధమికం గా నిర్ధారించినప్పటికీ, పలువురు ఆయన మృతి పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జన్ పార్టీ చీఫ్ పప్పు యాదవ్ కూడా ఆయనది ఆత్మహత్య కాదని , హత్య అని ఆరోపించారు. నిన్న పాట్నా లోని సుశాంత్ ఇంటికి వెళ్లిన పప్పు యాదవ్ ఆయన మృతి పై అనుమానాలున్నాయని మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. 
 
              సుశాంత్ ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని... ఆయన మృతి పై అనుమానాలున్నాయని, ఈ విషయమై సిబిఐ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేసారు. ఇది ఇలా ఉంటె... మరో వైపు సుశాంత్ కుటుంబ సభ్యులు కూడా ఆయన మృతి పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ ను హత్య చేసేసి.. దానిని ఆత్మహత్య చేసుకున్నట్లు గా చూపిస్తున్నారని పలువురు వాదిస్తున్నారు. ముంబై పోలీసులు కూడా దీనిని తొలుత ఆత్మహత్య గా భావించినా.. అనుమానాస్పద మృతి గా నమోదు చేసుకున్నారు.
 
              మరో వైపు సుశాంత్ పోస్ట్ మార్టం రిపోర్టు పై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆయనది హత్యా లేక ఆత్మా హత్యా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక తేలనుంది. దీనితో.. అందరు ఆ రిపోర్ట్ కోసం చూస్తున్నారు. అయితే... కొందరు మాత్రం సుశాంత్ ఆరు నెలలు గా తీవ్ర మనస్థాపం తో ఉన్నారని.. అందుకే ఆత్మహత్య కు పాల్పడి ఉంటారని చెబుతున్నారు. ముంబై పోలీసులు కూడా ఆయన మృతి పై విచారణ చేస్తున్నారు

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox