Breaking News

త్వరలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ 

20 th Nov 2020, UTC

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబుకు తొత్తుగా మారిపోయారని టీడీపీ అధికార ప్రతినిధిగావ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్నికలు పెట్టమంటే పెడుతున్నారు.. వద్దంటే మానేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ కేడర్ చంద్రబాబు కంటే నిమ్మగడ్డ రమేష్‌ను ఎక్కుగా నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ పదవీ విరమణ (రిటైర్మెంట్) తరువాత టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారనే అనుమానం మాకు ఉందని విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును దింపి టీడీపీ నేతలు నిమ్మగడ్డ రమేష్‌కు పగ్గాలు అప్పగిస్తారనే అనుమానం కలుగుతుందన్నారు.

అలాగే రాజ్యాంగ నిబంధనలను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తుంగలో తొక్కుతున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతలతో స్టార్ హోటల్లో కూర్చొని మంతనాలు జరిపిన వ్యక్తి నిమ్మగడ్డ అని విమర్శించారు. కరోనా లేని సమయంలో ఎన్నికలు వాయిదా వేశారని, కరోనా ఎక్కువుగా ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని నిమ్మగడ్డ రమేష్ పట్టించుకోలేదని చెప్పారు. పేదలకు ఇళ్లు ఇస్తామంటే దేశ చరిత్రలో అడ్డుకున్న పార్టీ టీడీపీ మాత్రమేనని, ప్రతిపక్ష నేతగా చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox