Breaking News

ఓ మంచి రోజు చూసి చెప్తా అంటున్న నిహారిక

26 th Feb 2021, UTC
ఓ మంచి రోజు చూసి చెప్తా అంటున్న నిహారిక

విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల జంటగా ఆరుముగా కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్’. 2018 ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం విజయవంతం అయ్యింది. మూడేళ్ల తరవాత ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువాదం చేసి ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ రావూరి వెంకటస్వామి ఈ చిత్రం తెలుగు హాక్కులను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ ఓ మంచి రోజు చూసి చెప్తా చిత్రం తమిళంలో మంచి విజయం సాధించింది. విజయ్ సేతుపతి నటన ఈ చిత్రానికే ఒక హైలైట్. విలక్షణ నటనతో ప్రేక్షకులని అలరిస్తారు. నిహారిక కొణిదెల ఎప్పుడూ చేయని పాత్రలో కనిపిస్తారు. ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. తెలుగు ప్రేక్షకులకి కచ్చితంగా నచ్చుతుంది. ఈ చిత్రాన్ని మార్చి 19న భారీగా విడుదల చేస్తున్నాం’ అని తెలిపారు.

నిహారిక చివరిగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కనిపించారు. ఆ తరవాత ఆమె వెంకట చైతన్యను పెళ్లాడారు. ఇది నిహారిక నటించిన ఏకైక తమిళ సినిమా కావడం విశేషం.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox