Breaking News

ఎన్ సి బి విచారణ ఎఫెక్ట్.. విజయ్ సినిమా నుంచి అనన్య పాండే ఔట్ ?

23 rd Oct 2021, UTC

నటి అనన్య పాండే ఇంటిపై  నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో  దాడి చేసిన తర్వాత విచారణకు హాజరుకావాలని  ఆమెకు సమన్లు ​​అందాయి. నివేదికల ప్రకారం 2018-19 మధ్య కాలంలో ఆర్యన్ ఖాన్ కోసం 'గంజాయి ' ఏర్పాటు చేయడానికి నటి అంగీకరించింది.  , అనన్య పాండేను గురువారం దాదాపు 4 గంటల పాటు విచారించారు. విచారణ సమయంలో ఎన్ సి బి  ఆర్యన్ ఖాన్‌తో ఆమె చాట్‌లను చూపించింది. ఇలా వుండగా ఎన్ సి బి విచారణతో అనన్య  పాండే తమిళ హీరో విజయ్ చిత్రంలో నటించే అవకాశాన్ని కోల్పోయినట్లు సమాచారం.

విజయ్ నటించే 66 వ చిత్రంలో హీరోయిన్ గా అనన్య పాండేను ఎంపిక చేసారు.  ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనుండగా దిల్ రాజు నిర్మిస్తారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.  డ్రగ్స్ కేసులో అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, ఆర్యన్ ఖాన్ అరెస్టులో అనన్య  ఇన్ వాల్వ్ మెంట్ వుందన్న వార్తల నేపధ్యంలో మేకర్స్ ఆమెను సినిమా కోసం పరిగణించకూడదని  భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox