Breaking News

త్వరలో సారా, రకుల్ కు ఎన్ సీ బీ సమన్లు

15 th Sep 2020, UTC
త్వరలో సారా, రకుల్ కు ఎన్ సీ బీ సమన్లు

బాలీవుడ్ :సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితురాలు రియా చక్రవర్తిని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో‌ అధికారులు విచారించగా బాలీవుడ్‌లోని ప్రముఖుల పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ కూతురు సారా అలీ ఖాన్‌, సిమోన్‌ ఖంబట్టా పేర్లను రియా విచారణలో వెల్లడించింది. దీంతో దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్‌సీబీ త్వరలో సారా, రకుల్‌, సిమోన్‌లకు సమన్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. ఈ కేసులో నిందితులైన రియా, ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తి ఇచ్చిన సమాచారం మేరకు సుశాంత్‌ ఫాంహౌస్‌, పవనా డ్యామ్‌ హోమ్‌లో జరిగే పార్టీలపై ఎన్‌సీబీ బృందం దృష్టి సారించింది. రియా, సుశాంత్‌తో కలిసి ఇక్కడి పార్టీలకు చాలాసార్లు వచ్చారని, అంతేగాక సారా, శ్రద్దా కపూర్‌ కూడా సుశాంత్‌ తో కలిసి ఈ పార్టీలకు హాజరైనట్లు తమ విచారణలో వెల్లడైందని ఎన్‌సీబీ తెలిపింది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox