Breaking News

'నాంది' డిజిటల్ హక్కులు 'ఆహ' సొంతం.. ఎంత పలికిందంటే..?

27 th Feb 2021, UTC

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ రొటీన్ కామెడీ జోనర్ ను పక్కన పెట్టి సీరియస్ రోల్ ను ప్రయోగాత్మకం గా చేసాడు. ఇది మొదటి ప్రయోగం కాకపోయినప్పటికీ, అల్లరి నరేష్ ను సీరియస్ హీరో గా ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పటివరకు కామెడీ జోనర్ లోనే అల్లరి నరేష్ అలరించారు. ప్రస్తుతం ఆయన ఎంచుకున్న పాత్ర కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. "నాంది" సినిమా మంచి టాక్ తెచ్చుకుని థియేటర్లలో విజయవంతం గా ప్రదర్శించబడుతోంది.

సతీష్ వేగేష్న నిర్మాణం లో వచ్చిన ఈ సినిమా పై ట్రైలర్ రిలీజ్ అయినప్పటినుంచే భారీ గా అంచనాలున్నాయి. ఆ తరువాత సినిమా విడుదలయ్యి ఆ అంచనాలను అందుకుంది. విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడు ఈ సినిమా కి దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా మొత్తానికి హిట్ టాక్ తెచ్చుకోవడం తో డిజిటల్ రైట్స్ కి కూడా బాగానే గిరాకీ ఏర్పడింది.

మొత్తానికి, ఆహా ఓటిటి ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. సినిమా విడుదల కి ముందు ఆహ వ్యవస్థాపకుడు అల్లు అరవింద్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసాడట. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత అల్లరి నరేష్ హిట్ కొట్టడం తో బాగా హ్యాపీ గా ఉన్నారు. డిజిటల్ రైట్స్ కోసం 2.75 కోట్లు చెల్లించి ఆహ ఈ సినిమా ని సొంతం చేసుకుందని సమాచారం. తొందరలోనే నాంది సినిమా ఆహ ఓటిటి పై కి రాబోతోందన్నమాట.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox