Breaking News

ఆదిత్య 999 తో నందమూరి మోక్షజ్జ ఎంట్రీ

19 th Jul 2021, UTC
ఆదిత్య 999 తో నందమూరి మోక్షజ్జ ఎంట్రీ

టాలీవుడ్ :సింగీతం శ్రీనువాసురావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369  సినిమా అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. టైమ్ మెషిన్ ను కధాంశంగా తీసుకుని తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ ఆకర్షించింది. ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆదివారం ఆదిత్య 369 యొక్క 30వ వార్షికోత్సవం సందర్బంగా నందమూరి బాలకృష్ణ సీక్వెల్ గురించి కొన్ని ఆసక్తికరమైన అప్ డేట్స్ షేర్ చేసుకున్నారు.

ఈ సినిమా  సీక్వెల్ పేరు ‘ఆదిత్య 999. ఇది నా కొడుకు మోక్షజ్జ తొలి చిత్రం అవుతుంది ”అని బాలయ్య పేర్కొన్నారు. ఆదిత్య 999, 2023 లో  విడుదల కానుందని నందమూరి హీరో అన్నారు. మోక్షజ్జ ఎంట్రీకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తొలి కోసం నందమూరి అభిమానులు మరో రెండేళ్లు వేచి ఉండాల్సి ఉంటుంది. సీక్వెల్ డైరెక్టర్ గురించి అడిగినప్పుడు, తాను ఇంకా దర్శకుడిని ఎంపిక చేయలేదని బాలయ్య వెల్లడించారు. నేను ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించగలను అంటూ ఆయన చెప్పారు.

బాలకృష్ణ వ్యాఖ్యల ప్రకారం, ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లి 2023 లో థియేటర్లలో విడుదల కానుంది. ఇది భారీ బడ్జెట్, తారాగణంతో తెరకెక్కుతుందని తెలుస్తోంది. మరిన్ని వార్తలు చదవండి 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox