Breaking News

ఫోర్జరీ పత్రాలతో బెయిల్ పొందిన శ్యామ్.కె. నాయుడు..!

30 th Jun 2020, UTC

కొన్ని రోజుల క్రితం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోట.కె. నాయుడు సోదరుడు శ్యామ్.కె. నాయుడుపై ఎస్.ఆర్. నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆర్టిస్ట్ సాయిసుధా కేసు పెట్టిన విషయం తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ శ్యామ్.కె. నాయుడుపై ఆమె చేసిన ఫిర్యాదుతో ఎస్.ఆర్.నగర్ పోలీసులు శ్యామ్.కె. నాయుడుని అరెస్ట్ చేశారు.

అయితే అరెస్ట్ అయిన రెండు రోజులకే బెయిల్ మీద శ్యామ్.కె.నాయుడు బయటకు వచ్చేశాడు. ఇప్పుడీ కేసులో మరో కొత్త ట్విస్ట్ నెలకొంది. ఇప్పుడతనిపై మరో కేసు నమోదైంది.

ఆర్టిస్ట్ సాయిసుధాతో కాంప్రమైజ్ అయినట్లుగా కోర్టులో శ్యామ్.కె. నాయుడు పిటిషన్ వేయడంతో.. నిజంగానే ఆమె కాంప్రమైజ్ అయ్యిందని అంతా అనుకున్నారు. అయితే అలాంటిదేమీ లేదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆమె కోర్టుకు తెలిపింది.

దీంతో శ్యామ్.కె. నాయుడు బెయిల్‌ను నాంపల్లి కోర్టు రద్దు చేసింది. అంతేకాకుండా శ్యామ్.కె. నాయుడుపై సంతకం ఫోర్జరీ అంటూ మరో కేసు నమోదైంది.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox