Breaking News

నాగ చైతన్య హర్రర్ మూవీ చేస్తున్నాడా..?

08 th Jun 2020, UTC
నాగ చైతన్య హర్రర్ మూవీ చేస్తున్నాడా..?
అక్కినేని నట వారసుడు నాగ చైతన్య కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ ఉంది. అయితే.. అప్పట్లో మాస్ ఇమేజ్ కోసం "బెజవాడ" , " ఆటోనగర్ సూర్య" వంటి సినిమాలు ట్రై చేసిన నాగచైతన్య కు మాస్ హీరో గాను పర్వాలేదనిపించుకున్నాడు.. మజిలీ సినిమాతో.. తన జీవిత సహచరి సమంత తో నటించిన నాగచైతన్య పక్క ఫామిలీ హీరో అనిపించుకున్నాడు. పెళ్లి చేసుకున్న తరువాత.. తొలిసారి ఇద్దరు కలిసి "మజిలీ" సినిమాలో నటించారు.. "ఏ మాయ చేసావే" సినిమాతో మొదలైన వీరిద్దరి ప్రేమాయణం... పెళ్లివరకు చేరి... అభిమానుల్లో హిట్ పెయిర్ గా నిలిచింది.
 
             తాజాగా..నాగ చైతన్య..సాయి పల్లవి తో కలిసి "లవ్ స్టోరీ" సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. కరోనా మహమ్మారి కారణం గా.. వాయిదా పడింది.. అయితే.. మజిలీ సినిమా తరువాత నాగచైతన్య కూడా తన సినిమాల జోరు పెంచాడు. మజిలీ సక్సెస్ కావడం తో.. విభిన్న తరహా సినిమాలు చేయాలనీ నిర్ణయించుకున్నాడు. ఆ తరహా లో నటించిన "వెంకీ మామ" చిత్రం ఆశించినంతగా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం లో "లవ్ స్టోరీ" సినిమా చేస్తున్న నాగ చైతన్య..తర్వాత పరశురామ్ తోనూ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే.. పరశురామ్ ప్రస్తుతం మహేష్ బాబు "సర్కారు వారి పాట" సినిమాతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈలోపు.. మనం దర్శకుడు విక్రమ్ కుమార్ తో కలిసి ఓ హర్రర్ చిత్రం చేయడానికి నాగ చైతన్య సిద్ధం అయినట్లు తెలుస్తోంది.
 
             అయితే.. ఈ సినిమా విక్రమ్ మొదటి సినిమా 13Bకి సీక్వెల్ అనే టాక్ ఉంది. అయితే.. ఎట్టకేలకు విక్రమ్ కుమార్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు. నాగచైతన్య తో చేసే సినిమా 13Bకి సీక్వెల్ కాదని చెప్పుకొచ్చాడు. తాను నాగ చైతన్య తో చేయబోయే సినిమా ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox