Breaking News

మంత్రి వర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్

03 rd May 2021, UTC
మంత్రి వర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేశారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం నుంచి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ పంపారు. సీఎం సిఫార్సు మేరకు గవర్నర్ తమిళిసై ఈటల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇకపై ఈటల రాజేందర్ మాజీ మంత్రి కానున్నారు.

వైద్యాఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఆ ఆరోపణలు వచ్చిందే తడవుగా ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు ఆదేశించారు. అదే రోజు రాత్రి ఈటల ప్రెస్ మీట్ నిర్వహించి ఆ ఆరోపణలను ఖండించారు.శనివారం మధ్యాహ్నం ఈటల రాజేందర్ వద్ద ఉన్న వైద్యఆరోగ్యశాఖను గవర్నర్ తమిళిసై తొలగించి సీఎం కేసీఆర్‌కు బదలాయించారు.

భూ కబ్జా ఆరోపణలతో కేసీఆర్ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా కలెక్టర్ పూర్తి నివేదికను సీఎస్ సోమేశ్ కుమార్‌కు అందజేశారు. ఇందులో ఈటల రాజేందర్ 66 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు తేల్చారు. తాజాగా ఈటల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox