Breaking News

గడప గడపని తాకే మిడిల్ క్లాస్ మెలోడీస్..!

20 th Nov 2020, UTC

టాలీవుడ్ :ఆనంద్‍ దేవరకొండ, వర్ష బొల్లమ్మ హీరో హీరోయిన్లుగా, వినోద్ అనంతోజు దర్శకత్వంలో వచ్చిన సినిమా "మిడిల్ క్లాస్ మెలోడీస్". ఈ సినిమా పేరుకు తగ్గట్లే ప్రతి మిడిల్ క్లాస్ గడపను తడుతుంది. ఈ సినిమాకి ప్రత్యేక కథ అని చెప్పడం కన్నా, కొందరు మిడిల్ క్లాస్ కుటుంబాల జీవితాల్లోని సంఘటనల సమాహారం అని చెప్పడం బాగుంటుంది. ఈ కథ అంత సహజంగా ఉంటుందని. ఈ సినిమాలో సంఘటనలన్నీ మన మధ్యతరగతి వ్యక్తుల జీవితాల్లో జరుగుతున్నట్లే అనిపిస్తాయి.

ఈ సినిమాలో హీరో ఓ మధ్యతరగతి కుటుంబంలో అబ్బాయి. ఓ పెద్ద పెద్ద కలలేం ఉండవు. ఉన్నంతలో కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అనుకునే మనస్తత్వం. గుంటూరు నగరం పరిసరాల్లో ఓ పల్లెటూరులో రాఘవ(హీరో) తండ్రి కొండల రావు (గోపరాజు రమణ)కు ఓ కాకా హోటల్ ఉంటుంది. అందులో, రాఘవ బొంబాయి చట్నీని చేస్తుంటాడు. రాఘవ చేసే బొంబాయి చట్నీని చాలా స్పెషల్ గా చేస్తుంటాడు. కేవలం అతని చట్నీకి ఊళ్ళో ఫాన్స్ ఉంటారు. అయితే, ఈ హోటల్ ను నగరంలో నడిపితే, తన చట్నీ ఫేమస్ అయ్యి బిజినెస్ బాగా నడుస్తుందని రాఘవ కలలు కంటుంటాడు. కానీ ఇవేమి తండ్రి కొండల రావుకు నచ్చవు. సందుకో హోటల్ ఉండే గుంటూరులో వీళ్ళు హోటల్ పెడితే మాత్రం గిట్టుబాటు కాదనుకుంటాడు.

అసలు ఈ సినిమాలో హైలెట్ ఏంటంటే హీరో తండ్రి కొండల రావు పాత్రే. దేనికి ఎలా రియాక్ట్ అవుతాడో ప్రేక్షకులు ఊహించలేరు. అదే ఆ పాత్రని సినిమా అయిపోయాక కూడా గుర్తుంచుకునేలా చేస్తుంది. ఈ సినిమా మొత్తం సాఫీగా సాగిపోతుంది. హీరోతో హీరోయిన్ పరిచయం అన్ని సహజంగా కధలో భాగంగా నడిచిపోతూ ఉంటుంది. ఎక్కడ బ్రేకులు ట్విస్ట్ లు ఉండవు. ఆకట్టుకునే కుటుంబ డ్రామాగా నడిచిపోతుంది. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి స్లో అయిపోయినట్లు ఉంటుంది. హీరో, హీరోయిన్ల పెళ్ళి తంతు కూడా స్లోగా సాగుతుంది. దీనితో ఈ సినిమాలో మెలోడీ మిస్ అయినట్లు అనిపిస్తుంది. అప్పటిదాకా సాఫీగా అనిపించి, ఆ తరువాత సాగదీస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. 

ఆ తరువాత క్లైమాక్స్ కూడా ఈజీగా అయిపోయినట్లనిపిస్తుంది. సినిమా అప్పుడే అయిపోయిందా అన్న భావన కలుగుతుంది. మొత్తానికి ఆకట్టుకుంటుంది ఈ సినిమా. రాఘవగా ఆనంద్ దేవరకొండ నటనను వంక పెట్టడానికేమి ఉండదు. కానీ గుంటూరు యాసలో మరికొంత ప్రావీణ్యత సాధించి ఉంటె బాగుండేది. ఈ సినిమా పూర్తి అయిపోయిన కూడా తండ్రి కొండల రావ్ పాత్రను కూడా అందరు గుర్తుంచుకుంటారు. హీరో, హీరోయిన్ల మధ్య సన్నివేశాలకు మరింత ప్రాధాన్యత ఇచ్చి ఉంటె బాగుండేది అనిపిస్తుంది. వర్ష బొల్లమ్మ కూడా చక్కగా నటించింది. ఈ సినిమాలో అందరి పాత్రకి ప్రాముఖ్యత ఉంది. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox