Breaking News

రవితేజ ’రావణాసుర‘ కు మెగాస్టార్ క్లాప్

14 th Jan 2022, UTC
 రవితేజ ’రావణాసుర‘  కు మెగాస్టార్ క్లాప్

మాస్ మహరాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో‘రావణాసుర’చిత్రం షూటింగ్ శుక్రవారం లాంఛ‌నంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్‌, మెగాస్టార్ చిరంజీవి హాజ‌ర‌య్యారు. ముహుర్త‌పు స‌న్నివేశానికి చిరంజీవి క్లాప్ కొట్టారు. తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మినిష్టర్ త‌ల‌సాని శ్రీనివాస యాద‌వ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. గోపీచంద్ మ‌లినేని, కె.ఎస్‌.ర‌వీంద్ర గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ‌కు అందించారు. టైటిల్ పోస్ట‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు.

రవితేజ  ఇప్ప‌టికే ఖిలాడి సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ, ధ‌మాకా చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. రామారావు ఆన్ డ్యూటీ చిత్రీక‌ర‌ణ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. . ఈ సినిమాను ప్రారంబించిన రోజునే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసారు. రావ‌ణాసుర చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox