Breaking News

నిర్మాతగా మారిన మెగా డాటర్..!

09 th Jul 2020, UTC
నిర్మాతగా మారిన మెగా డాటర్..!

మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నిర్మాతగా మారారు.  సుష్మిత  మంచి ఫ్యాషన్‌ డిజైనర్‌ అన్న విషయం తెలిసిందే.  తన తండ్రి చిరంజీవి సినిమాలకు ఆమె  కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసారు. తాజాగా సుష్మిత తన భర్త విష్ణుతో కలిసి గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ  మొదటగా ఓ వెబ్‌ సిరీస్‌ ద్వారా డిజిటల్‌ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది.

. ఓయ్ సినిమాను డైరెక్ట్ చేసిన ఆనంద్ రంగ ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయ‌నున్నారు. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తెర‌కెక్క‌బోయే ఈ సిరీస్‌లో ఎనిమిది ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వ్య‌వ‌ధి 30 నుండి 40 నిమిషాలు ఉండే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే ఇందులో న‌టించ‌బోయే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు వెల్ల‌డ‌వుతుంద‌ని టాక్‌.

 ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే హైదరాబాద్‌లో జరిగాయి. మెగాస్టార్‌ సతీమణి సురేఖ చేతుల మీదుగా ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన సుష్మిత.. తన తల్లికి ధన్యవాదాలు తెలిపారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సుష్మితకు బెస్ట్‌ విషెస్‌ చెబతున్నారు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox