Breaking News

గోదావరి తీరంలో మణిరత్నం షూటింగ్..!

22 nd Feb 2021, UTC
గోదావరి తీరంలో మణిరత్నం షూటింగ్..!

పశ్చిమ గోదావరి :మణిరత్నం సినిమా అంటే వెచ్చని గోదావరి తెరల్లా మనసుని తాకుతుంది. అదే మణిరత్నమే గోదావరి తీరం వద్ద సినిమా తీస్తే, ఆ సినిమా ఇంకెంత హత్తుకుంటుందో. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే రామోజీ ఫిలింసిటీలో కొంత చిత్రీకరణను పూర్తి చేసుకుంది.

తాజాగా, కొన్ని సన్నివేశాలను గోదావరి తీరం వద్ద తీయనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం సింగంపల్లి వద్ద మణిరత్నం షూటింగ్ కోసం రావడంతో ఈ ప్రాంతమంతా సందడి నెలకొంది. సింగంపల్లి నుంచి పాపికొండలు వరకు షూటింగ్ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే ట్రయిల్ రన్ కూడా పూర్తి అయింది. ఈ సినిమా షూటింగ్ కోసం టూరిజం బోట్లను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. విక్రమ్, ఐశ్వర్యా రాయ్, జయం రవి, త్రిష వంటి తారలు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మరిన్ని వార్తలు చదవండి 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox