Breaking News

నా వియ్యంకుడి కి ధన్యవాదాలు..: మంచు మనోజ్ ట్వీట్ వైరల్..!

29 th Jun 2020, UTC
నా వియ్యంకుడి కి ధన్యవాదాలు..: మంచు మనోజ్ ట్వీట్ వైరల్..!
ఇంత మంచి అల్లుడిని ఇచ్చినా సాయి ధరమ్ తేజ్ కి ధన్యవాదాలు అంటూ.. మంచు మనోజ్ ట్విట్టర్ లో వేసిన ట్వీట్ ఇపుడు వైరల్ అయింది. వీరిద్దరూ వియ్యంకులు ఏంటా అనుకుంటున్నారా? సింగిల్ అంటూ.. సోలో సాంగ్ పడుకునే సాయి ధరమ్ తేజ్ కి పిల్లలా? అని ఆశ్చర్యపడకండి.. వీళ్లిద్దరు పెట్ పేరెంట్స్ అంది.. ఇద్దరి దగ్గర చెరో కుక్క ఉన్నాయి.. అవి ఆపోజిట్ సెక్స్ కావడం తో వీరిద్దరూ వియ్యంకులు కాబోతున్నారన్నమాట. అందుకే.. మంచు మనోజ్ సాయి ధరమ్ తేజ్ కు థాంక్స్ చెబుతున్నారు.
 
                 సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్ ల దగ్గర రెండు కుక్కలున్నాయి. సాయి ధరమ్ తేజ్ దగ్గర ఉన్న మక కుక్క, తన దగ్గర ఉన్న ఆడ కుక్కతో డేటింగ్ చేస్తుందని మనోజ్ ట్వీట్ చేసాడు. ఈ కరోనా కాలం లో అవి కూడా సోషల్ డిస్టెన్స్ ను పాటించుకుంటూ డేటింగ్ చేస్తున్నాయని ట్విట్టర్ లో వాటి తో కలిసి దిగిన ఫోటో ను పోస్ట్ చేసారు. "తనకు ఇంత మంచి అల్లుడిని ఇచ్చినందుకు నా వియ్యంకుడు సాయి ధరమ్ తేజ్‌కి ప్రత్యేక ధన్యవాదాలు.. త్వరలోనే ముహూర్తం పెట్టించి శుభలేఖలు వేయిస్తామంటూ " మంచు మనోజ్ ట్విట్టర్ లో పోస్ట్ వేశారు. ఈ రెండిటికి పెళ్లి కూడా చేయిస్తారట.
 
                   ప్రస్తుతం లాక్ డౌన్ కారణం గా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. మనోజ్  ప్రస్తుతం అహం బ్రహ్మాస్మి సినిమా పనులతో బిజీ గా ఉన్నారు. అలానే.. సాయి ధరమ్ తేజ్ కూడా "సోలో బతుకే సో బెటర్" సినిమాతో బిజీ గా ఉన్నారు. లాక్ డౌన్ ముగిసాక.. వీరి షూటింగ్ లు కూడా ప్రారంభం అవొచ్చు. కానీ లాక్ డౌన్ పైనే ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. 
 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox