Breaking News

ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి:మహేష్ బాబు

30 th Jun 2020, UTC

లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత కరోనా పాజిటివ్‌ల సంఖ్య భారీగా పెరుగుతున్న  ఈ కఠిన సమయంలో ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని  టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్ ‌బాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదని సోషల్‌ మీడియా వేదికగా ప్రజలను ఆయన  మరోసారి అప్రమత్తం చేశారు.

లాక్‌డౌన్‌ సడలింపులు తర్వాత కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మనల్ని, మన కుటుంబాల్ని, మన చుట్టు పక్కల ప్రజలను రక్షించుకునే సమయమిది. బయటకు వెళ్లేటప్పుడు తప్పుకుండా మాస్క్‌ ధరించండి. భౌతిక దూరాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం సూచించిన అన్ని భద్రతా ప్రమాణాలను పాటించండి. అదేవిధంగా ప్రతీ ఒక్కరు ఆరోగ్య సేతు యాప్‌ను ఉపయోగించండి. ఇప్పటివరకు ఎవరైన ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి.

 మన చుట్టుపక్కల నమోదయ్యే కరోనా కేసులను సూచిస్తూ ఈ యాప్‌ మనల్ని అప్రమత్తం చేస్తుంది. అంతేకాకుండా అత్యవసర వైద్య సదుపాయాలను కూడా ఆరోగ్యసేతు ద్వారా పొందవచ్చు. అందరూ సురక్షితంగా ఉండండి, బాధ్యతతో వ్యవహరించండి. త్వరలోనే మంచి రోజులు వస్తాయి’ అంటూ మహేశ్‌ పోస్ట్‌ చేశారు.

ఇక దేశంలో తొలి కేసు నమోదైనప్పటి నుంచి కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మహేశ్‌ పలు పోస్టులు చేసిన విషయం తెలిసిందే. . ఈ కష్టకాలంలో విశేష సేవలందిస్తున్న కరోనా ఫ్రంట్‌ వారియర్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox