Breaking News

బిగ్ బీ సినిమాకు బ్రేక్

20 th Sep 2020, UTC
బిగ్ బీ సినిమాకు బ్రేక్

బాలీవుడ్ :సూపర్‌స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌ నటించిన సినిమా ఝుండ్ విడుదలకు బ్రేక్ పడింది. సుమారు ఏడాదికాలంగా కాపీరైట్ వివాదంలో నడుస్తోన్న ఆ సినిమా విడుదలపై కూకట్ పల్లి న్యాయస్థానం స్టే ఇచ్చి విదేశాల్లో కూడా ఆ సినిమా స్ట్రీమింగ్‌ను నిలిపివేయాలని పేర్కొంది.

ఝుండ్ సినిమా కాపీరైట్స్‌ తన దగ్గర ఉన్నాయని మియాపూర్‌కు చెందిన ఫిల్మ్‌మేకర్ డాక్టర్‌ నంది చిన్నికుమార్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కూకట్‌పల్లి న్యాయస్థానం దీనిపై విచారణకు స్వీకరించింది. నిర్మాత, దర్శకుడు నాగరాజ్, టీ సిరీస్ ఛైర్మన్ భూషణ్ కుమార్, లీడ్ రోల్‌లో నటించిన అమితాబ్ బచ్చన్‌లకు ఇదివరకే నోటీసులను జారీ చేసింది. ఏడాదికాలంగా కొనసాగుతున్న ఈ కేసు విచారణలో తాజాగా కూకట్‌పల్లి న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

అమితాబ్‌ బచ్చన్‌ ఈ సినిమాలో ఫుట్‌బాల్ కోచ్‌గా నటించారు. స్లమ్‌ సాకర్‌ ఛాంపియన్‌ అఖిలేశ్‌ పాల్‌ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా కథ ఉంటుంది. మరాఠీ బ్లాక్ బస్టర్  సైరత్‌ దర్శకుడు నాగరాజ్ పోపట్‌రావ్ మన్జులే ఝుండ్ సినిమాను తెరకెక్కించారు. అయితే  కాపీరైట్స్‌ విషయంలో వివాదాలు రేగడంతో సినిమా విడుదలకు బ్రేక్ పడింది. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox