Breaking News

చైనా వస్తువుల్ని బాన్ చేద్దాం.. :నాగబాబు

03 rd Jun 2020, UTC

గత కొద్దీ రోజులుగా భారత సరిహద్దు వద్ద చైనా కవ్వింపు చర్యలకు పాలపడుతున్న సంగతి తెలిసిందే. వాస్తవాధీన రేఖకు ఆనుకుని భారీ గా సైన్యాన్ని మోహరిస్తోంది. మరో వైపు... యుద్దానికి సిద్ధం గా ఉండాలంటూ.. చైనా దేశాధ్యక్షుడు జిన్ పింగ్ కూడా యుద్దానికి సిద్ధం గా ఉండాలంటూ తన సైన్యానికి ఆదేశించాడు. ఈ విషయమై  జనసేన నేత నాగబాబు స్పందించారు. చైనా వస్తువులను, యాప్స్‌ను భారత్‌లో అధికంగా వాడుతుండడంపై పలు వ్యాఖ్యలు చేశారు. 'చైనా ఉత్పత్తులు, చైనా యాప్స్‌లను నిషేధించాలి అంటూ ఆయన కోరారు. "మన దేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్న చైనా వస్తువుల్ని, సెల్ ఫోన్ యాప్స్‌ ను బహిష్కరిద్దాం. మన దేశంలో తయారైన వస్తువులని కొందాం. ప్రపంచంలో మన దేశం పెద్ద మార్కెట్. అన్ని దేశాల వస్తువులు ఇక్కడ అమ్మి సొమ్ము చేసుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు" అని నాగబాబు పేర్కొన్నారు. ఈ విషయమై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.
          "అదే మన ప్రొడక్ట్స్ ని మనమే కొంటే మన దేశమే లాభపడుతుంది. తిరిగి ఆ డబ్బుతో మన దేశం అభివృద్ధి చెందుతుంది. మనందరం బాగుపడతాం. మన డబ్బు  మన దేశంలోనే వుంటుంది, మనమే బాగుపడదాం. అంతే కానీ మన డబ్బుతో బాగుపడి మన దేశాన్ని అక్రమించుకోవాలని చూసే చైనా వస్తువుల్ని బ్యాన్‌ చేద్దాం" అని నాగబాబు ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox