Breaking News

'ఆదిపురుష్'లో కృతి సనన్..?

16 th Oct 2020, UTC
'ఆదిపురుష్'లో కృతి సనన్..?

బాలీవుడ్:  బాహుబలి సినిమా తరువాత.. ప్రభాస్ రేంజ్ అంతర్జాతీయ స్థాయి కి ఎదిగిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యం లో ప్రభాస్ ఏ సినిమా ఎంచుకున్నా అంచనాలు భారీ గా పెరుగుతున్నాయి. అయితే.. ప్రభాస్ తాజాగా ఒప్పుకున్న "ఆదిపురుష్" సినిమా పై కూడా భారీ గా అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.. ఇది ప్రభాస్ కి మొదటి డైరెక్ట్ హిందీ సినిమా..  బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్  ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం రామాయణ గాధ ఆధారం గా రూపొందుతుంది. 

ఈ సినిమా లో  ప్రభాస్ రాముడి పాత్రను, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణ్ పాత్రను పోషిస్తున్నారు. అయితే... సీత పాత్రను ఎవరు పోషిస్తున్నారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే.. ఈ పాత్ర కోసం కీర్తి సురేష్, అనుష్క శర్మ , కైరా అద్వానీ పేర్లు వినిపించాయి.. అయితే..వీటిల్లో నిజం లేదని ఈ చిత్ర యూనిట్ ఇప్పటికే ఖండించింది.. ఈ క్రమం లో తాజాగా.. కృతి సనన్ పేరు బయటకు వస్తోంది. కాగా.. దర్శక నిర్మాతలు ఆమె పేరు ని పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.త్వరలోనే ఈ విషయం లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.. మరో వైపు అజయ్ దేవగన్ కూడా ఈ సినిమా లో కీలక పాత్ర పోషిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరిన్ని బాలీవుడ్ వార్తలు చదవండి 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox