Breaking News

మరోసారి మహేష్ తో కియారా అద్వానీ..!

04 th Jun 2020, UTC
మరోసారి మహేష్ తో కియారా అద్వానీ..!

భరత్‌ అనే నేను’ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అయిన కథానాయిక కియారా అద్వానీ తరువాత‘వినయ విధేయ రామ’లో కనిపించారు. అయితే ‘వినయ విధేయ...’ తర్వాత కియారా మరో తెలుగు సినిమా కమిట్‌ కాలేదు. కారణం హిందీలో నాలుగైదు సినిమాలు ఉండటమే. ఇప్పుడు కియారా ఓ తెలుగు సినిమా కమిట్‌ కాబోతున్నట్లు సమాచారం.

ఏ హీరో సినిమా ద్వారా అయితే తెలుగుకి పరిచయం అయ్యారో అదే హీరో సినిమాలో నటించబోతున్నారట. ‘భరత్‌ అనే నేను’లో మహేశ్‌బాబుకి జోడీగా కనిపించిన కియారా ఇప్పుడు ‘సర్కారువారి పాట’లోనూ మహేశ్‌ సరసన నటించబోతున్నారట.

పరశురామ్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలోని మహేశ్‌ ఫస్ట్‌ లుక్‌ సూపర్‌ స్టార్‌ కృష్ణ జన్మదినం సందర్భంగా మే 31న విడుదలైంది. మరి.. మహేశ్‌–కియారా జంట మళ్లీ తెర మీద కనబడుతుందా? దీనిపై చిత్రబృందం వివరణ ఇవ్వాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox