Breaking News

మహానటి సినిమా చేయకూడదనుకున్నా:కీర్తి సురేష్

09 th Jun 2020, UTC

మహానటి` సావిత్రి సినిమాలో సావిత్రి పాత్ర పోషించిన నటి కీర్తి సురేష్ ఆ పాత్రలో జీవించిందనే చెప్పాలి. సావిత్రిగా కీర్తి నటనకు జాతీయ అవార్డు లభించింది.  నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం  ఎన్నో ప్రశంసలను అందుకుంది. అయితే ఈ కథ వినగానే సినిమా చేయకూడదని కీర్తి అనుకుందట.

ఈ చిత్రం విడుదలై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నాగ్ అశ్విన్, స్వప్నాదత్, ప్రియాదత్, దుల్కర్ సల్మాన్, కీర్తి సురేష్ తదితరులు వీడియో కాల్ ద్వారా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా కీర్తి మాట్లాడుతూ.. `నాగ్ అశ్విన్ ఈ సినిమా కథను నాలుగున్నర గంటలపాటు చెప్పాడు. కథ విన్న వెంటనే చాలా భయమేసింది. ఈ సినిమా చేయలేనని చెప్పా.

 సావిత్రిగారు ఎందరికో అభిమాన నటి. అలాంటి పాత్రలో కనిపించాలంటే ఎంతో ఉన్నతంగా నటించాలి. ఈ పాత్ర నేను పోషించగలనా? అంచనాలను అందుకోగలనా అని సందేహాలు వచ్చాయి. దానితో భయం వేసింది.  అది నా వల్ల కాదని భావించా. అయితే నాగ్ అశ్విన్ నాపై నమ్మకంతో ఉన్నారు. అతని ప్రోత్సాహంతో ముందడుగేశాన`ని చెప్పింది.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox