Breaking News

కీర్తి సురేష్ కు సాయం చేసిన ఆ నలుగురు హీరోయిన్లు..!

08 th Jun 2020, UTC

కరోనా మహమ్మారి కారణం గా ఓ వైపు షూటింగ్ లు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.. మరో వైపు.. షూటింగ్ ను పూర్తి చేసుకున్న సినిమాలు కూడా విడుదల కు నోచుకోలేదు.. దీనితో.. చిత్ర పరిశ్రమ స్ట్రక్ అయింది. కష్టాలు ఒక వైపు.. నష్టాలూ ఒకవైపు అన్నట్లుంది చిత్రసీమ పరిస్థితి. ఇది ఇలా ఉంటె.. కొందరు నిర్మాతలు, దర్శకులు, నటులు తమ తమ సినిమాలను ఓటిటి ప్లాటుఫామ్స్ పై విడుదల చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
 
         ఇది ఇలా ఉంటె.. లాక్ డౌన్ 5 లో చాల వరకు కేంద్రం సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మరో వైపు.. కొన్ని రాష్ట్రాలు నిబంధనలతో షూటింగ్ లకు కూడా అనుమతులు ఇచ్చేశాయి. అయితే.. షూటింగ్ లకు అనుమతులు వచ్చినా.. కేంద్రం థియేటర్లను తెరవడానికి అనుమతించకపోవడ తో సమస్య మళ్ళి మొదటికి వచ్చింది. అయితే... థియేటర్లు తెరిచినా జనాలు వస్తారో..లేదోనన్న భయం కూడా ఉండడం తో.. నిర్మాతలు..తమ సినిమాలను ఓటిటి ప్లాటుఫామ్స్ కు అమ్మడానికి మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే తమిళ్ హీరో సూర్య, జ్యోతిక తమ సినిమాలను ఓటిటి ప్లాటుఫామ్స్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటిటి ప్లాటుఫామ్ అమెజాన్ ప్రైమ్ కూడా ఓ నెలలో ఏడు సినిమాలు విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. 
 
           తాజాగా...కీర్తి సురేష్ కూడా ఆ బాటే పట్టింది. ఆమె నటించిన పెంగ్విన్ సినిమా నాలుగు భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతోంది. అయితే.. ఈ చిత్రానికి ఒక్కో భాష లోను ఒక్కో హీరోయిన్ ఈ చిత్ర టీజర్ ను ఈ రోజు మధ్యాహ్నం పన్నెండుగంటలకు లాంచ్  చేశారు. తెలుగులో సమంత, హిందీ నుంచి తాప్సి, తమిళ్ లో త్రిష, ఇక మళయాళంలో మంజు వారియర్ ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేయడానికి ముందుకు వచ్చారు. ఓ స్టార్ హీరోయిన్ కోసం.. మరో నలుగురు స్టార్ హీరోయిన్లు కదిలి రావడం పట్ల మంచి పరిణామం గా భావిస్తున్నారు. మరో వైపు నెటిజన్లు..సదరు హీరోయిన్ల ఫాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సినిమా థియేటర్స్ లో విడుదలకు నోచుకోలేక డిజిటల్ వరల్డ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్న సమయంలో కీర్తి సినిమాకు అండగా నిలిచిన వీరికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే అంటూ నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో అలరించబోతోందని  తెలుస్తోంది. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox