Breaking News

కొత్త సినిమా ప్రారంభించిన కీరవాణి తనయుడు..!

26 th Oct 2020, UTC

టాలీవుడ్  :కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి "మత్తు వదలరా" సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ఏ సినిమాను సింహ ఒప్పుకోలేదు. చాలా కధలు విన్న తరువాత తాజాగా ఓ కాదని ఒకే చేసారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. నేడు పూజ కార్యక్రమాలతో.. ఈ సినిమా పనులు ప్రారంభించారు. ఈ సినిమా ద్వారా నూతన దర్శకుడు మణికాంత్ తెలుగు తెర కు పరిచయం కాబోతున్నాడు. నిర్మాత సాయి కొర్రపాటితో కిలిసి రజిని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పానేని కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

చిత్ర శుక్ల, మిషా నారంగ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా సింహ సరసన నటిస్తున్నారు. ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఈ సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి షాట్ కు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి క్లాప్ కొట్టారు. అలాగే ఎం ఎం కీరవాణి ఈ సినిమా స్క్రిప్ట్ ను చిత్ర యూనిట్ కి అందచేశారు. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందించనున్నారు. నాగేంద్ర పిళ్ల ఈ సినిమాకి కధని సమకూర్చారు. సత్య గిడుతురు ఎడిటర్ గా పని చేస్తున్నారు. సురేష్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox