Breaking News

సొరచేపతో కలిసి కత్రినా స్విమ్మింగ్...!

09 th Jun 2020, UTC
సొరచేపతో కలిసి కత్రినా స్విమ్మింగ్...!
కరోనా మహమ్మారి కారణం గా భారత దేశం దాదాపు రెండున్నర నెలల పాటు లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. ఇప్పటికీ ఐదవ విడత లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. మూడవ విడత లాక్ డౌన్ నుంచి  కొన్ని సడలింపులు ఇస్తూ వచ్చారు... అయితే.. ఇప్పటికీ సగానికి సగం మంది ఇళ్లకే పరిమితమైపోయారు.
 
        ఈ లాక్ డౌన్ కాలం లో షూటింగ్స్ లేకపోవడం తో.. సినీ తారలు...ప్రముఖులు.. రకరకాల ఛాలెంజ్ లు చేయడం.. తమకి ఉన్న టాలెంట్ లను బయటపెట్టడం వంటివి చేస్తున్నారు. అలా..ఫ్యాన్స్ కు వినోదం పంచుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది తమ ఇండ్లలో పనులు చేస్తుండగా,మరికొంతమంది వంటగదిలో ఘుమ ఘుమలాడిస్తున్నారు. 
 
       మరికొందరేమో.. రక రకాల ఫిట్ నెస్ వీడియోలు చేస్తూ... తమ అందం కాపాడుకుంటూ.. తమ ఫాన్స్ కి కూడా ఆరోగ్యం పై శ్రద్ధపెంచుకోమని చెబుతున్నారు. ఈ తరహా లో బాలీవుడ్ హీరోయిన్ కత్రీనా కైఫ్ సముద్రం లో ఈత కొడుతూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. మాములు గా స్విమ్ చేయడం కాదండోయ్.. ఆమె ఓ సొరచేప తో కలిసి స్విమ్ చేస్తోంది. ఆమె..ఓ సొరచేపతో కలిసి ఈత కొడుతున్న పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. "నా బాల్యమిత్రుడితో సముద్రంలో అందమైన రోజు"  అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox