Breaking News

కరోనా కాలంలో... కార్తికేయ 2 టీం సాహసం..!

08 th Jun 2020, UTC
కరోనా కాలంలో... కార్తికేయ 2 టీం సాహసం..!
కరోనా మహమ్మారి ప్రతాపం రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం దేశం లో సగటు ఓ రోజుకి పదివేల కొత్త కేసులు నమోదవుతున్నాయి.. మరోవైపు లాక్ డౌన్ ను సడలించడం తో.. వ్యాధి వ్యాప్తి  జరగడానికి మరింత అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యం లో షూటింగ్ లను తిరిగి ప్రారంభించే విషయమై ఇప్పటికే సినీ పెద్దలు తర్జన భర్జనలు పడుతున్న సంగతి తెలిసిందే. 
           మరో వైపు.. సినీ హీరో లు కూడా తమ పెళ్ళిళ్ళను వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. అయితే.. దిల్ రాజు పెళ్లిచేసుకోవడం తో కరోనా కాలం లో టాలీవుడ్ లో పెళ్లి సందడి కనబడింది. హీరో నిఖిల్ కూడా అప్పటికే రెండు సార్లు వాయిదా వేస్తూ వచ్చి కరోనా టైం లో నే పెళ్లి చేసేసుకుని ఓ సాహసం చేసేసాడు. ఓ ఇంటివాడు అయిపోయిన నిఖిల్ తాజాగా.. ఈ టైం లో తిరిగి షూటింగ్ ను ప్రారంభించడానికి సిద్ధపడి మరో సాహసం చేయబోతున్నాడు.
            నిఖిల్ ప్రస్తుతం కార్తికేయ 2 పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ కొంత మేర విదేశాలలో చిత్రీకరించాల్సి ఉంది. కరోనాతో సినిమా, సీరియళ్ల షూటింగ్‌లన్నీ వాయిదా పడ్డ నేపధ్యం లో ఈ చిత్ర యూనిట్ షూటింగ్ కు సిద్ధం అవుతోంది. అయితే.. ఈ కరోనా గడ్డు కాలం లో విదేశాలకు వెళ్లి షూట్ చేయడమంటే సాహసమనే చెప్పాలి. ఈ చిత్రం లోని ఓ  కీలక షెడ్యూల్‌ని కంబోడియా పరిసరాల్లోని రీస్‌లో చిత్రీకరించనున్నారు. చందూ టీమ్ ఇందుకోసం సౌత్ ఈస్ట్ ఆసియా దేశానికి లొకేషన్ అనుమతుల కోసం వెళుతున్నారని సమాచారం.అనుమతులు లభిస్తాయో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.. ఈ సినిమాలో నిఖిల్ సరసన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox