Breaking News

దోస్తానా 2 నుంచి బయటకు వచ్చేసిన కార్తీక్ ఆర్యన్

16 th Apr 2021, UTC

కార్తీక్ ఆర్యన్  ధమాకా, భూల్ భూలైయా 2 తో సహా అగ్రశ్రేణి ప్రాజెక్టులతో ముందుకు దూసుకు పోతున్నాడు. అయితే తాజాగా కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న దోస్తానా 2 నుండి ఈ నటుడు బయటకు వచ్చేసాడని తెలుస్తోంది. ఈ సినిమాలో కార్తీక్ జాన్వీకపూర్ తో నటించవలసి వుంది. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్, టైమింగ్స్ ఆర్యన్ మరియు కరణ్ జోహార్ మధ్య విభేదాలకు కారణమయ్యాయని తెలుస్తోంది.కార్తీక్ గత ఒకటిన్నర సంవత్సరాలుగా దోస్తానా 2 తో  చర్చలు జరుపుతున్నారు.

 ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లినతరువాత  ఇప్పటికే 20 రోజులు  షూటింగ్ జరిగింది. అయితే డేట్స్ అడ్జస్ట్ మెంట్స్ వద్ద గందరగోళాల కారణంగా కరణ్ మరియు  కార్తీక్ ల మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయి. దీనితో వీరిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు.కార్తీక్ ఆర్యన్‌తో మళ్లీ పనిచేయకూడదని కరణ్ జోహార్ నిర్ణయించుకున్నారని  తెలుస్తోంది.

కార్తీక్ యొక్క టాలెంట్ ఏజెన్సీ క్వాన్ నుండి  కరణ్ జోహార్ కు చెందిన ధర్మ షెడ్యూల్ తేదీలను పొందలేకపోయింది. దీనితో భవిష్యత్తులో ఎప్పుడూ కార్తీక్‌తో చేయకూడదని ధర్మ ప్రొడక్షన్స్ నిర్ణయించింది. దోస్తానా 2 బృందం దీనిపై త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox