Breaking News

అస్కార్ బరిలో జల్లికట్టు

25 th Nov 2020, UTC
అస్కార్ బరిలో జల్లికట్టు

మలయాళ చిత్రంజల్లికట్టు’ ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలోకి భారత్‌ తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికయింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీలో ఈ చిత్రం అర్హత సాధించింది. ఫిల్మ్  మేకర్ రాహుల్ రానైల్ నేతృత్వంలోని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యురీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. మొత్తం 26 చిత్రాలకు గాను ఈ  సినిమా ఆస్కార్ బరిలోకి ఎంపిక కావడం విశేషం. 

14 మంది సభ్యులతో కూడిన జ్యురీ జల్లికట్టు మూవీని సెలెక్ట్ చేసినట్టు రాహుల్  తెలిపారు. ఈ చిత్రానికి  సంబంధించిన లొకేషన్, టెక్నీకల్, హ్యూమన్ యాస్పెక్ట్స్ అన్నీ దీన్ని ఇందుకు అర్హమైనవిగా నిలబెట్టాయని ఆయన చెప్పారు. మ‌నుషులు, జంతువుల మ‌ధ్య బావోద్వేగ పూరిత స‌న్నివేశాల‌ను కళ్లకు క‌ట్టిన‌ట్టు చూపించారని, అందకే ఈ సినిమాను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.

కేరళలోని ఓ అటవీ ప్రాంతంలో నివసించే ప్రజలందరికి గొడ్డు మాంసం అంటే ఇష్టం. ఆంటోనీ అనే వ్యక్తి  ఉరందరికి బీఫ్‌ సరఫరా చేస్తుంటాడు. అతను అమ్మే అడవి దున్న మాంసం అంటే అక్కడి వాళ్లందరికి పిచ్చి. అలా ఓరోజు అడ‌వి దున్న ని క‌బేళాకి త‌ర‌లించి, దాని మాంసం విక్ర‌యిద్దాం అనుకునేలోపు అది త‌ప్పించుకుంటుంది. అడ‌విని ధ్వంసం చేస్తూ, మ‌నుషుల్ని గాయ‌ప‌రుస్తూ దాగుడుమూత‌లు ఆడుతుంది. దాన్ని పట్టుకునేందుకు ఊరంతా ఏకమై తిరుగుతారు. ఎలాగైనా దాన్ని చంపి మాంసం తలా ఇంత పంచుకోవాలనుకుంటారు. మరి ఆ దున్న వారికి దొరికిందా? ఈలోపు ఏం జ‌రిగింది? ఎంత న‌ష్ట‌ప‌ర‌చింది? దీనిని దర్శకుడు ఆసక్తికరంగా తెరకెక్కించారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox