Breaking News

కలర్ ఫోటో పై జగపతిబాబు కితాబు..!

29 th Oct 2020, UTC
కలర్ ఫోటో పై జగపతిబాబు కితాబు..!

టాలీవుడ్ :సుహాన్ "కలర్ ఫోటో" విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. ఈ సినిమా ఇటీవలే ఓటిటి ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంటోంది. సాయిరాజేశ్ నీలం, బెన్నీ ముప్పానేని ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. సందీప్ రాజ్ ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు..రవితేజ, విజయ్ దేవరకొండ, నాని, మారుతి వంటి వారు ఈ సినిమా పై ప్రశంసల వర్షం కురిపించారు.

తాజాగా జగపతి బాబు కూడా ఈ సినిమా గురించి ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ సినిమాను చూసి చాలా ఇంప్రెస్ అయినట్లు తెలిపారు. సందీప్ తనను తానూ నిరూపించుకున్నాడన్నారు. సుహాన్ ఓ హీరోగానే కాకుండా మంచి నటుడిగా నిరూపించుకున్నారన్నారు. ఓ సినిమా హిట్ అవ్వాలంటే స్టార్ డమ్, భారీ బడ్జెట్ మాత్రమే కారణం కానక్కరలేదని ఈ సినిమా నిరూపిస్తుందన్నారు. నటీనటులు, టెక్నిషియన్లు అందరు కలిసి ఇలా ఓ సహజసిద్ధమైన సినిమాను తీయడం చుస్తే, ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి మంచి సినిమాలలో భాగం కావడం తనకి ఇష్టమన్నారు. చిన్న హీరోల సినిమాలలో తానూ నటించానని, తనకి అంత రెమ్యునరేషన్ ఇచ్చుకోలేమోనని, తనని చాలామంది సంప్రదించరని జగపతి బాబు చెప్పుకొచ్చారు. అయితే ఈ రెండిటిలో నిజం లేదన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox