Breaking News

గాడ్ ఫాదర్ లో బ్రిట్నీ స్పియర్స్ , సల్మాన్ ఖాన్ ?

13 th Oct 2021, UTC

తెలుగు మెగాస్టార్ చిరంజీవి  నటించిన ఆచార్య’ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు చిరంజీవి  పలు ప్రాజెక్టులతో బిజీగా వున్నారు.  చిరంజీవి మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ రీమేక్ గాడ్ ఫాదర్ లో నటిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న చిరంజీవి, మోహన్ లాల్ పాత్రను  చేయనున్నారు. 

తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ ,  హాలీవుడ్ స్టార్లు కూడ నటిస్తారన్న వార్తలు వస్తున్నాయి. హాలీవుడ్ పాప్ సెన్సేషన్ బ్రిట్నీ స్పియర్స్‌, చిరంజీవిపై ఒక పాట షూట్ చేయాలని  'గాడ్ ఫాదర్' మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  మరోవైపు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో అతిధి పాత్రలో కనిపించవచ్చు. 

ఈ చిత్రంలో  సల్మాన్ కాస్త నిడివి ఎక్కువ ఉన్న పాత్రనేచేస్తున్నారట. అంతేకాదు ఆయనపై ఓ సాంగ్ కూడా ఉందబోతోందని సమాచారం. ఇదే నిజమైతే 'గాడ్ ఫాదర్' మూవీపై పాన్ ఇండియన్ స్థాయిలో భారీ అంచనాలు నెలకొనడం ఖాయం. ఈ  పొలిటికల్ డ్రామాకు  థమన్ ఎస్ 'గాడ్ ఫాదర్' కోసం సంగీతం సమకూర్చనున్నారు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox