Breaking News

రణదీప్ హుడాతోమొదటిసారి నటిస్తున్న ఇలియానా

16 th Oct 2020, UTC

బాలీవుడ్ :సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్  తమ తదుపరి చిత్రం 'అన్ఫైర్ & లవ్లీ' పూర్తి కామెడీగా వుంటుందని ప్రకటించింది. హర్యానాకు చెందిన ఒక అమ్మాయి తన రంగు కారణంగా సమాజం నుంచి ఎదర్కొన్న సమస్యల నేపధ్యంలో కధ సాగుతుంది. ఫెయిర్ గా వున్నవారి పట్ల భారతీయులకు వుండే అభిమానం, పక్షపాతం కూడ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా సాధికారత వైపు సాగుతున్న సమయంలో ఇటువంటి వివక్షతలు సరికాదని చెప్పడమే సినిమా ఇతివృత్తం .

ఇందులో నటి ఇలియానా మొదటిసారిగా రణదీప్ హుడాతో కలిసి నటిస్తోంది. ఈ చిత్రానికి కధ బల్విందర్ సింగ్ జంజువా, రూపీందర్ చాహల్ మరియు అనిల్ రోధన్ అందించగా సంగీతం అమిత్ త్రివేది మరియు ఇర్షాద్ కామిల్ గేయరచయిత.

సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వివేక్ కృష్ణాని మాట్లాడుతూసామాజిక వాతావరణం గురించి వినోదాత్మకంగా, ప్రభావవంతంగా మరియు తెలివిగా ఉండే ప్రత్యేకమైన కథలను ప్రదర్శించడానికి భారతదేశం సిద్దంగా వుందన్నారు. దీనికోసం మా వేదికను ఉపయోగించడానికి మేము ఎల్లప్పుడూ కృషి చేస్తున్నాము, క్రొత్త ప్రతిభను పరిచయం చేయడం ద్వారా అయినా ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox