Breaking News

గద్దలకొండ గణేష్ చిత్రానికి ఏడాది.. ఎమోషన్ అయిన హరీష్ శంకర్

20 th Sep 2020, UTC

టాలీవుడ్ :డైరక్టర్ హరీష్ శంకర్ ప్రతిభ గురించి పెద్దగా చెప్పనక్కరలేదు. పవర్ స్టార్ తో ఆయన చేసిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. యువ నటుడు వరుణ్ తేజ్‌ను గద్దలకొండ గణేష్ చిత్రంలో మాస్ లుక్ లో విభిన్నంగా చూపించారు. ఈ చిత్రం విడుదలై  నేటికి ఏడాది అవుతున్న సందర్బంగా రీష్ శంకర్ ఎమోషనల్ ట్వీట్స్ చేసారు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కర్నీ పేరు పేరునా తలుచుకుంటున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్స్, రైటర్స్, ఇలా అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాడు. వరుణ్ తేజ్, పూజా హెగ్డేలకు ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలిపాడు.
 
థ్యాంక్స్ మైడియర్ వరుణ్ తేజ్, నాపై ఎంతో నమ్మకం ఉంచావ్. నీ అనితర సాధ్యమైన అంకితభావంతో నన్ను కదిలించావ్. నా కెరీర్‌లో నిలిచిపోయే ఈ అద్భుత చిత్రం వచ్చి ఇంతలోనే ఏడాది అయిందంటే నమ్మలేకపోతోన్నా, లవ్యూ హీరో అంటూ వరుణ్ తేజ్‌పై ప్రశంసలు కురిపించాడు. ఇక పూజా హెగ్డేపై కామెంట్ చేస్తూ, నా శ్రీదేవీలా నటించినందుకు థ్యాంక్స్ పూజా హెగ్డే. స్నేహితురాలితో కలిసి పని చేయడం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ఈ సినిమా కోసం నీవు చేసిన కృషిని మరిచిపోలేను. నీ అద్భుతమైన నటన ఎప్పుడూ గుర్తుండిపోతుంది. అంటూ ట్వీట్ చేశాడు. మరిన్ని టాలీవుడ్ వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox