Breaking News

ఎస్పీబీ పేరుతొ చెన్నైలో డబ్బింగ్ స్టూడియో!

21 st Nov 2020, UTC

చెన్నై :భారత సినీ సంగీత ప్రియులకు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పేరు సుపరిచితమే. తన గాంధర్వ గానంతో అందరిని మైమరిపించే గాన గంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం కరోనా మహమ్మారి కారణంగా మనందరికీ దూరమయ్యారు. అయితే, ఆయన మరణానంతరం సీనియర్ నటుడు రాధారవి బాలుగారి పేరు మీద ఓ డబ్బింగ్ స్టూడియోను నెలకొల్పుతానని ప్రకటన చేసారు. ప్రస్తుతం రాధారవి దక్షిణ భారత సినీ, టెలివిజన్ కళాకారుల సంఘానికి అధ్యక్షుడుగా ఉన్నారు.

ఇచ్చిన మాట ప్రకారమే, ఆయన చెన్నైలో ఎస్పీబీ డబ్బింగ్ స్టూడియోను ప్రారంభించారు. ఆయన ప్రకటన ఇచ్చిన రెండు నెలలకే రాధారవి ఈ స్టూడియోని తీసుకురాగలిగారు. ఎస్పీబీ గాయకుడిగానే కాదు. మంచి డబ్బింగ్ కళాకారుడిగా కూడా పేరు సంపాదించుకున్నారు. కమల్ హాసన్, రజనీకాంత్ వంటి నట దిగ్గజాలకు కూడా ఆయన వాయిస్ ఓవర్ చెప్పారు. ఎస్పీబీ పేరుతొ డబ్బింగ్ స్టూడియోను ప్రారంభించడంతో దక్షిణాది కళాకారుల సంఘం సంతోషం వ్యక్తం చేసింది. మరిన్ని వార్తలు చదవండి.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox