Breaking News

అలివేలుగా రకుల్ ప్రీత్ సింగ్..!

08 th Jun 2020, UTC
అలివేలుగా రకుల్ ప్రీత్ సింగ్..!

డైరెక్టర్ తేజ ఇటీవల రెండు సినిమాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఒకటి ‘అలివేలు వేంకటరమణ’ కాగా రెండోది ‘రాక్షస రాజు.. రావణాసురుడు’. ఇందులో మొదటి చిత్రమైన ‘అలివేలు వేంకటరమణ’  సినిమాలో నటించే హీరోయిన్ విషయమై పలువురు హీరోయిన్‌ల పేర్లు వార్తల్లోకి  వచ్చాయి. ముందుగా కాజల్ ఈ పాత్ర చేస్తుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత స్వీటీ అనుష్క‌ను ఈ పాత్ర కోసం సంప్రదిస్తున్నారని, తరువాతసాయిపల్లవి పేరు వినిపించింది.
 అయితే వీరెవరూ కన్ ఫర్మ్ కాలేదని ఇప్పుడీ పాత్ర కోసం ప్రస్తుతం ఇండస్ట్రీలో ఖాళీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్‌ని తీసుకుందామని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్‌తో ఆమె ఇప్పటికే ‘లౌక్యం’ అనే సినిమా చేసింది. ప్రస్తుతం తేజ తన ‘అలివేలు మంగ’గా రకుల్‌ని సెలక్ట్ చేయనున్నారని అంటున్నారు. ఇప్పటికే రకుల్‌ని సంప్రదించారని, కథ విన్నాక తన డెసిషన్ చెబుతానని రకుల్ అన్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తుంది.

 ప్రస్తుతానికి చేతిలో సరైన సినిమా లేదు అలాగే తేజ సినిమాలో హీరోయిన్ పాత్రలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆమె ఓకే అంటుంది. అందులో డౌటే లేదు. అయితే ఈ విషయం అధికారికంగా వెల్లడికాలేదు.

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox