Breaking News

Director Raghavender Rao : తొలిసారి నటుడిగా దర్శకేంద్రుడు

31 st Jul 2021, UTC

Tollywood : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తొలిసారి నటుడిగా  తెరపైన కనిపించనున్నారు. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల జంటగా వస్తున్న చిత్రం 'పెళ్లిసందD' చిత్రంలో ఆయన సీనియర్ సిటిజన్ పాత్రను పోషిస్తున్నారు. గతంలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన 'పెళ్లిసందడి' ఘనవిజయం సాధించిన విజయం తెలిసిందే.

ఇప్పుడదే టైటిల్ తో గౌరి రోణంకి దర్శకత్వంలో తాజా చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రాఘవేంద్రరావు నటిస్తుండడం విశేషం. ఆయన పాత్ర పేరు వశిష్ట. దీనికి సంబంధించిన వీడియోను చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది.

దీనిపై టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు రాజమౌళి, అనిల్ రావిపూడి స్పందించారు. 100 సినిమాలకు దర్శకత్వం వహించిన తర్వాత మన మౌన ముని కెమెరా ముందుకు వచ్చారు. 'పెళ్లిసందD' చిత్రం ద్వారా నటుడిగా రాఘవేంద్రరావు ఫస్ట్ లుక్ ఇదే. చూడండి అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.

ఇంతకాలం కెమెరా వెనుక ఉండి చూపించిన దర్శకేంద్రుడి మాయ ఇప్పుడు కెమెరా ముందు చూడబోతున్నాం అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. "రాఘవేంద్రరావు గురూజీ. మళ్లీ ఈ 'పెళ్లిసందడి' మరో సంచలనం అవ్వాలని కోరుకుంటున్నాను" అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి 

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox